రాష్ట్రం ప్రీమియం కట్టలె..ఫసల్ బీమా పైసల్ రాలె

రాష్ట్రం ప్రీమియం కట్టలె..ఫసల్ బీమా పైసల్ రాలె

రెండేండ్లుగా రాష్ట్ర సర్కార్ ఫసల్ బీమా ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు అందాల్సిన దాదాపు రూ. 934 కోట్ల  పరిహారం పెండింగ్లో పడింది. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ నెల 5న సీఎం కేసీఆర్కు లెటర్ రాశారు. రాష్ట్ర సర్కారు సబ్సిడీ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులకు పరిహారం ఆగిపోయిందన్నారు. . క్లెయిమ్స్ సెటిల్ కాకపోవడంతో కేంద్రానికి రైతులు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం పర్సనల్గా జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని కోరారు. 

రాష్ట్రంలో గత రెండేళ్ల ఫసల్ బీమా పరిహారం రైతులకు ఇంకా అందలేదు. రాష్ట్రం తన వాటా ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు అందాల్సిన దాదాపు రూ. 934 కోట్లు పెండింగ్లో పడిపోయాయి. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ నెల 5న సీఎం కేసీఆర్కు లెటర్ రాశారు. రాష్ట్ర సర్కారు సబ్సిడీ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులకు పరిహారం ఆగిపోయిందన్నారు. రెండేళ్లకు సంబంధించి రూ. 467.45 కోట్ల రాష్ట్ర వాటా పెండింగ్లో ఉందని చెప్పారు. క్లెయిమ్స్ సెటిల్ కాకపోవడంతో కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం పర్సనల్గా జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని కోరారు. కాగా, 2020–-21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా స్కీమ్ను 
నిలిపేసింది. 
  
రెండేళ్లుగా ఇట్లనే

మామూలుగా ఫండ్స్, ఇతర పథకాల నిధుల కేటాయింపుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లెటర్లు పంపిస్తుంటారు. రాష్ట్రంలో మాత్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు, అర్హులైన వారికి లబ్ధి అందే విషయంలో కేంద్రం నుంచే సీఎం కేసీఆర్కు లెటర్లు వస్తున్నాయి. పీఎం కిసాన్ అమలు విషయంలోనూ రైతుల వివరాలు సరిగ్గా ఇవ్వడం లేదని గతేడాది లెటర్ అందింది. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇచ్చే ఫండ్స్ విషయమై కూడా రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లెటర్ రాశారు. తాము కేంద్రాన్ని చాలా అడిగామని, లెటర్లు రాశామని చెప్పుకునే సీఎం, మంత్రులు.. అక్కడి నుంచి వచ్చే లెటర్లపై మాత్రం మాట్లాడట్లేదు.

నిధులివ్వాలని వ్యవసాయ శాఖ కోరినా..

పంటల బీమాకు రైతులు ముందే ప్రీమియం చెల్లించగా.. వచ్చిన రైతుల సంఖ్య, విస్తీర్ణం ఆధారంగా కేంద్రం ప్రీమియం సబ్సిడీ రిలీజ్ చేసింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం పెండింగ్లో పెట్టింది. దీంతో అకాల వర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు అందాల్సిన రూ. 934 కోట్లు ఆగిపోయాయి. 2018–19 వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు రూ. 149 కోట్ల ప్రీమియాన్ని బీమా కంపెనీలకు చెల్లించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వాటా కింద రూ. 147.96 కోట్ల చొప్పున ఇవ్వాలి. 2019–20లోనూ రైతులు రూ.242.23 కోట్లను ప్రీమియం వాటాగా కట్టారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రూ.324.45 కోట్ల చొప్పున చెల్లించాలి. మొత్తంగా స్టేట్ సర్కారు రూ.467.45 కోట్లు విడుదల చేస్తే లక్షల మంది రైతులకు  రూ. 934 కోట్ల పరిహారం అందుతుంది. నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ను  వ్యవసాయ శాఖ 3, 4 సార్లు కోరినా స్పందన లేదు.

అకాల నష్టాల్లో.. పథకం ఆదుకుందిలా

రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది 2016–17లో రైతులకు రూ. 178 కోట్లు పరిహారంగా అందింది. 2017–18లో రూ. 645 కోట్లు పరిహారం పొందారు. అయితే బీజేపీకి రైతులు దగ్గర కావొద్దనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ను రాష్ట్ర సర్కారు నిలిపేసిందని విమర్శలు వస్తున్నాయి. రైతుల కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామనే సీఎం కేసీఆర్ రూ. 467 కోట్ల ప్రీమియం విడుదల చేయకపోవడం ఏంటని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.